భారీ శరీరాలున్నా మోడలింగ్ రంగంలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకున్న ప్లస్ సైజ్ మోడల్స్ ..సమాజంలో కొని వర్గాలు తమపట్ల చూపుతున్న వివక్ష పట్ల బావురుమంటున్నారు. స్విమ్ సూట్లు, బికినీలతో తాము ఫోటో షూట్ లో పాల్గొంటే.. తమ ముఖాలను, శరీరాలను మార్ఫ్ చేసి నెట్ లో పెడుతున్న వైనం తమనెంతో బాధిస్తోందని అంటున్నారు. గోవా, ముంబై, మంగళూరు తదితర నగరాలకు చెందిన తన్వీ గీతా రవిశంకర్, నేహా పరుల్కర్, రోషిని కుమార్, నీలాక్షి సింగ్, రచనా బరూహా, కృపాంజలి టెలిస్ వంటి మోడల్స్ ఇలా తమ ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. ఇంటర్నెట్ ని వీళ్ళు ఓ క్రూరమైన వేదికగా పేర్కొన్నారు.
అయితే తమ భారీ శరీరాలను కాకుండా, తమ తెలివితేటలను, సమయస్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని కొన్నిషో ల నిర్వాహకులు తమ ఈవెంట్లలో పాల్గొనేందుకు అవకాశమివ్వడం తమ అదృష్టమని  తన్వీ గీతా రవిశంకర్ అన్నారు. ఉదాహరణకు తను లోగడ లాక్మే ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేట్ చేశానని, తన మోడలింగ్ అందరికీ నచ్చిందని తెలిపింది. అలాగే బ్యాంక్ ఉద్యోగిని అయిన నేహా పరుల్కర్ మోడల్ గా రాణించాలనుకుంది.  మొదట్లో ఇందుకు తన పేరెంట్స్ అభ్యంతరం చెప్పినా,, ఆతరువాత ఓకె చెప్పారని ఆమె తెలిపింది. ఇక-ఇప్పటికీ తమకు అనేకమంది నుంచి అసభ్య కరమైన సందేశాలు, అందుతున్నాయని, కొందరు దుర్భాషలాడుతున్నారని రోషిని కుమార్, నీలాక్షిసింగ్ తెలిపారు. లావుగా ఉండడం మేం చేసుకున్న పాపమా అని వీరు ప్రశ్నించారు. కానీ తమ బాయ్ ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫర్లు, కొంతమంది సెలబ్రిటీలు సైతం తమను ప్రోత్సహించడం తమను ఇంకా ఈ రంగానికి మరింత సన్నిహితం చేస్తోందని, అదే చాలని ఈ ప్లస్ సైజ్ మోడల్స్ చెబుతున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *