ప్రధాని మోదీ అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్‌లో తనకు నచ్చిన ఖాదీ జాకెట్ కొన్నారు. డిజిటల్ ఇండియా నినాదంతో ముందుకెళ్తున్న ఆయన.. ఈ జాకెట్‌కు రూపే కార్డు ద్వారా చెల్లింపు చేయడం విశేషం. ‘వైబ్రాంట్ గుజరాత్’  లో భాగంగా ఈ నగరంలో సుమారు 12 రోజులపాటు ఇలాంటి ఫెస్టివల్ నిర్వహిస్తారు. దీనికి హాజరైన మోదీ.. మొత్తం మాల్ అంతా కలియదిరిగారు. అయితే బిల్లు పేమెంట్ లో భాగంగా రూ పే కార్డు పిన్ నెంబర్ను పక్కనున్న వ్యక్తి ఎంటర్ చేయడం గమనార్హం. ఈ నెంబర్ ఇతరులకు తెలిస్తే మిస్ యూజ్ కావచ్చు. అయినా మోదీ సందేహించ లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *