ఆకాశంలో తరచూ కనిపించే ఎగిరే పళ్ళాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. వీటి గురించిన పరిశోధనలు ఏళ్ళ తరబడి జరుగుతున్నా..వీటి మిస్టరీ మాత్రం వీడడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా వాయవ్య ప్రాంతంలో ఈ మధ్యే నింగిలో ఇలాంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కనిపించింది. అసలే తుఫాను వాతావరణం… భారీ వర్షం….పిడుగులు పడుతూ.. మెరుపులు మెరుస్తున్న వేళ.. చటుక్కున ఆకాశంలో ఓ ఎగిరే పళ్ళెం మెరుస్తూ వలయాకారంగా తిరుగుతూ.. కనిపించింది. క్షణాల్లో మాయమైంది. ఈ దృశ్యాన్ని బ్రూమే పోలీసులు సీసీటీవీ కెమెరాలకెక్కించి ఫుటేజీని విడుదల చేశారు.

మానవాళి ఒక్కటే కాదు.. ఈ విశ్వంలో యేలియన్సూ ఉన్నారనడానికి ఇంకా ఏ నిదర్శనం కావాలి అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు.. లోగడ ఆస్ట్రేలియాలోనే కొంతమంది స్కూలు పిల్లలకు ఇలాంటి దృశ్యమే కనిపించిందట. ఆశ్చర్యపోయిన ఆ పిల్లలు తమ పెద్దలకు ఈ విషయం చెప్పారు. ఇప్పుడు తాజాగా పోలీసోళ్ళకే ఎగిరే పళ్ళెం కనబడడంతో ‘ ఇష్యూ ‘ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *