బీబీసీ రేడియోలో తెల్లవారికి (శ్వేత జాతీయులకు) ఉద్యోగాలివ్వరట. లండన్ లోని తమ బీబీసీ 1 రేడియో స్టేషన్ లో ట్రైనీ జర్నలిస్టుగా వేకెన్సీ ఉందని, అయితే దీనికి ‘ పోష్ ‘ వైట్ పీపుల్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఈ సంస్థ అంటోంది. ఈ మేరకు ఈ మధ్య ఓ యాడ్ విడుదల చేస్తూ.. ఏడాది కాలం ఉండే ఈ ట్రైనీ షిప్ కి 20 వేల పౌండ్ల వేతనం ఇస్తామని, కానీ నల్ల జాతీయులో, ఆసియన్లో, మైనారిటీ వర్గానికి చెందినవారో మాత్రమే అప్లై చేసుకోవచ్చునని పేర్కొంది. దీన్ని ఉద్యోగం అనడం కన్నా ట్రైనీ అనడమే బెస్ట్ అని ఈ సంస్థ స్పష్టం చేస్తోంది.

ఈ నిర్ణయంపై ఫిలిప్ అనే లాయర్ స్పందిస్తూ.. ఈక్వాలిటీ (సమానత్వ) చట్టం కింద తక్కువ జాతివారికీ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయనడానికి ఇది నిదర్శనమన్నాడు. జాబ్స్ కు దరఖాస్తు చేసుకునేందుకు మైనారిటీ లేదా అండర్ రిప్రెజెంటెడ్ గ్రూపులను ప్రోత్సహించడానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడుతాయని ఆయన పేర్కొన్నాడు. ఈ వర్గంవారు ఏ దేశానికి చెందినవారైనా, వారి జాతి ఏదైనా.. వారిని మినహాయించరాదని ఫిలిప్ వ్యాఖ్యానించాడు.

ఇప్పటికే తాము వివక్షకు గురవుతున్నామని ఇలాంటివారు ఆవేదన చెందుతున్నారని, దాన్ని దూరం చేయడానికే బీబీసీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఈ సంస్థను వెనకేసుకొచ్చాడు. ఏమైనా.. ఈ ధోరణి తెల్లతోలువారంటే (బ్రిటిషర్లంటే) చాలా హైక్లాస్ పీపుల్ అని, రిచ్ అని, వారిని ఉన్నతంగా చూపే ప్రయత్నమే ఇదని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *