ఏం.. పవర్ స్టార్.. పీపుల్ స్టార్‌గా మారకూడదా? ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా? ఈ ఎన్నికల తర్వాత అయ్యే తీరతాడు చూడండి.. అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడారు. నిజానికి.. తనకు పవర్‌స్టార్ అనే పిలుపులోనే ఆనందం ఉందని.. కానీ ప్రజాసేవ కోసం జనంలోకి వచ్చానని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా ఆ రెండు పార్టీలకు మద్దతునివ్వడమే తన నిస్వార్థ తత్వానికి నిదర్శనమని చెప్పారు. పార్టీ స్థాపించి ఐదేళ్లు గడిచిన నేపథ్యంలో.. ఈ గ్యాప్‌లో పార్టీ ఎంత ప్రగతి సాధించిందో చెప్పుకొస్తూ.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను చదివి వినిపించారు.

ఒక్కో రంగాన్ని, ఒక్కో సామాజిక వర్గాన్నీ, వృత్తినీ ప్రస్తావిస్తూ వాళ్లకు ఏమేం చేయబోతున్నానో వివరంగా చెప్పారు పవన్ కళ్యాణ్. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఏ కోశానా లేదని, కాకపొతే ముఖ్యమంత్రి అయితే తప్ప ప్రజలకు ఏదో ఒకటి చేయడం కుదురుతుందన్న కమిట్మెంట్ వల్లే తాను పెద్ద పార్టీలతో పోటీ పడాల్సివచ్చిందని చెప్పారు. వేదిక మీద.. తనతో పాటు.. కొంతమంది కీలక నేతల్ని కూడా కూర్చోబెట్టడం ద్వారా.. పవన్ తన ‘ఏక్ నిరంజన్’ సంప్రదాయాన్ని పక్కకు పెట్టినట్లయిది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *