ప్రభాస్‌ మూవీ ‘సాహో’ గురించి ఓ కొత్త వార్త ! ఇందులో ఓ సాంగ్‌ని గ్రాండ్‌‌గా చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ సింగర్స్ బియాన్సే, జేజీ, మిస్సీ ఈలియట్‌ పాటలకు డ్యాన్స్‌ చేశారు లారెంట్‌ నికోలాస్‌, లారీ నికోలాస్‌. వీళ్లతో కలిసి ప్రభాస్‌ ఓ పాటలో డ్యాన్స్‌ చేయబోతున్నాడని సమాచారం. లారెంట్‌- నికోలాస్‌ కవలలు. వీళ్ల డ్యాన్సుకు అంతర్జాతీయ గుర్తింపు వుంది. సినిమా మొత్తానికి ఈ సాంగ్ హైలైట్ అని చెబుతోంది యూనిట్. అంతేకాదు ఒక్క పాట కోసం భారీగా ఖర్చు చేస్తోంది.

కనీవినీ ఎరుగని రీతిలో సెట్లు, భారీ స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. వందలాది మంది బ్రెజిల్ డ్యాన్సర్లు ఇందులో పాల్గొంటారు. జాతర నేపథ్యంగా వచ్చే సాంగ్‌కు నేషనల్ అవార్డు విన్నర్, బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ వైభవి మర్చెంట్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకి సంబంధించి కొత్త విషయాలు బయటకురావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. యాక్షన్ సీన్స్‌ని దుబాయ్‌లో హాలీవుడ్‌ రేంజ్‌లో షూట్ చేసింది యూనిట్. ఇందులో ప్రభాస్‌ సీక్రెట్ ఏజెంట్‌ రోల్ చేస్తున్నట్లు మరోవైపు వార్తలు హంగామా చేస్తున్నాయి. సుజిత్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా‌కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మందిరాబేడీ, ఎవ్లిన్‌ శర్మ, జాకీ‌ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్ట్‌15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *