పదునైన మాటలతో వార్తల్లో నిలిచే నటుడు ప్రకాష్‌రాజ్ అడ్డంగా దొరికిపోయాడు. బెంగుళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఆయనపై ఎన్నికల కేసు నమోదైంది. మార్చి 12న బెంగుళూరులోని కొంతమంది మీడియా ప్రతినిధులు భావ ప్రకటన స్వేచ్ఛపై ఎంజీ రోడ్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో పాల్గొన్న ప్రకాష్‌రాజ్.. ఆవేశంగా మాట్లాడారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని, అందుకే ఆయనపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

ఆ ర్యాలీలో రాజకీయ పరమైన అంశాలకు అనుమతి ఇచ్చిందికాదని, ఐనా.. ఆయన తన పొలిటికల్ స్పీచ్ మాదిరిగా మాట్లాడారన్నది పోలీసుల వెర్షన్. ఆయనతోపాటు కార్యక్రమ నిర్వాహకులపైనా కేసు నమోదైంది. ప్రకాష్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి కార్యక్రమం ముగిసింది. దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *