ప్రియాంక ‘క్వాంటికో'పై సెగలు

ప్రియాంకచోప్రా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఆమె నటించిన ‘క్వాంటికో’ సిరీస్‌లో ఇండియన్స్‌ని టెర్రరిస్టులుగా చూపిస్తూ ఓ ఎపిసోడ్ ప్రసారమైంది. దీనిపై ఇండియాలో దుమారం మొదలైంది. సొంతదేశాన్ని అవమానిస్తూ ఇలాంటి సీన్స్ చేయడానికి సిగ్గు లేదంటూ ఆమెని దుమ్మెత్తిపోస్తున్నాయి కొన్ని హిందూసంస్థలు. అంతేకాదు ప్రియాంక దేశద్రోహి, ఆమెని పాకిస్థాన్‌కి పంపించండంటూ నిరసనలు  మొదలయ్యాయి.

దీనిపై సోషల్‌మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తంచేయడంతో రియాక్ట్ అయ్యింది ప్రియాంకచోప్రా. అందులో సీన్స్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

‘క్వాంటికో’లో చూపించేదంతా కల్పితం అని, ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశ్యంతో తీసింది కాదని తెలిపింది. ఐనా, సరే ఆమె వ్యవహారశైలిపై నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. ఇలాంటి సీన్లు చూపించడం ద్వారా భారతీయులపై అమెరికాలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


https://twitter.com/JagratiShukla29/status/1005129938893037568