ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సోదరి ప్రియాంక‌గాంధీ. సార్వత్రిక ఎన్నికల ముందు రాహుల్ అప్పగించిన బాధ్యతలపై నాలుగైదు రోజులుగా కసరత్తు చేసిన ఆమె, రంగంలోకి దిగేశారు. ఉత్తరప్రదేశ్‌ తూర్పు కాంగ్రెస్‌ పార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకగాంధీ, ఆ హోదాలో తొలిసారిగా సోమవారం లక్నోలో రోడ్‌షో చేపట్టారు.

దారి పొడవునా ప్రియాంకలకు ఘన స్వాగతం లభించింది. సోదరి పక్కన రాహుల్ వున్నారు. చాన్నాళ్లు తర్వాత యూపీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్పందన చూసి.. పార్టీ నేతలు పుల్‌జోష్‌లో వున్నారు. ప్రియాంకగాంధీని చూసేందుకు అధికంగా వచ్చారని అంటున్నారు.

మరోవైపు ప్రజలు, కార్యకర్తలతో మమేకమయ్యేందుకు ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు ప్రియాంకగాంధీ. ఎకౌంట్ ఓపెన్ నిమిషాల వ్యవధిలో ఫాలోవర్స్ అమాంతంగా పెరిగిపోయారు. ఇప్పటివరకు ఆమె ఎలాంటి ట్వీట్ చేయలేదు. కాగా.. ప్రియాంక ఏడుగుర్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. తన సోదరుడు రాహుల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అహ్మద్‌‌పటేల్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, అశోక్‌ గెహ్లోత్‌, సచిన్‌‌పైలట్‌, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలను ఆమె ఫాలో అవుతున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *