కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నడూ, ఎవరూ చూడని సీన్.. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం వి. నారాయణస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్యా విభేదాలు తారస్థాయికి చేరాయి. కిరణ్ బేడీ తీరును నిరసిస్తూ నారాయణస్వామి ఆమె ఇంటిముందే బైఠాయించి అక్కడే రాత్రి నిద్ర పోయారు. ఆయన వెంట ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఉన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కిరణ్ బేడీ ఇటీవల ఆదేశించారు. హెల్మెట్ పెట్టుకోని ఓ టూ వీలర్‌ని ఆమె అడ్డగించిన సంగతి కూడా తెలిసిందే.
అయితే ఈ నిబంధనను దశలవారీగా అమలు చేయాలనీ నారాయణస్వామి సూచించగా.. ఇందుకు ఆమె నిరాకరించారు. పైగా మంత్రి మండలి చేసిన కొన్ని ప్రతిపాదనలను కిరణ్ బేడీ వెనక్కి పంపడం కూడా సీఎం ఆగ్రహానికి కారణమైంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకే ప్రధాని మోదీ ఈ గవర్నర్ ద్వారా సమస్యలు సృష్టిస్తున్నారని నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. అటు-సీఎం, ఆయన అనుచరులు రాజ్ నివాస్ ను చుట్టుముట్టారని, తమను బయటకు వెళ్ళనివ్వడం లేదని, ఇది చట్ట విరుద్ధమని కిరణ్ బేడీ ప్రత్యారోపణ చేస్తున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *