బ్రిటన్‌ని బ్రెక్సిట్ గొడవ ఉడుకెత్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలా వద్దా అనే స్పష్టతకి రాలేక అక్కడొక రాజకీయ సంక్షోభమే నడుస్తోంది. పాలకుల్లోనూ, ప్రజల్లోనూ బ్రెక్సిట్ తీర్మానం మీదే ఎడతెరిపి లేని చర్చ. సహజంగానే మీడియా కూడా ఈ అంశాన్ని వీలైనంత ఎక్కువగా వాడుకుంటూ డిబేట్ల మీద డిబేట్లు నడుపుతోంది. ఇదే క్రమంలో స్కై న్యూస్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

‘ది ప్లెడ్జ్’ పేరుతో జరుగుతున్న డిబేట్‌లో రాచెల్ జాన్సన్ అనే బ్రెక్సిటీర్.. అకస్మాత్తుగా అర్థ నగ్నంగా మారిపోయింది. షర్ట్ బటన్స్ విప్పేసి.. తన వక్ష స్థలాన్ని ఎక్స్‌పోజ్ చేసింది. ప్రత్యక్ష ప్రసారంలో చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామం గ్లోబల్ మీడియాలో ఒక తాజా సంచలనం. ‘నన్ను, బ్రెక్సిట్ మీద నేను చేసే వాదనను జనం గుర్తించాలంటే ఇంతకంటే నాకు మరో మార్గం లేదు’ అంటూ సమర్థించుకుందామె. ‘ఈసారి బ్రెక్సిట్ మీద ఎప్పుడు చర్చ జరిగినా నేనే గుర్తుకు రావాలి’ అని ఆవేశంగా చెప్పుకుంది కూడా.

జాన్సన్ అలా చేస్తుండగానే.. ఆమె పక్కనే వున్న కో-ప్రెజెంటర్స్ , సిబ్బంది నిర్ఘాంతపోయి అచేతనంగా ఉండిపోయారు. ఇటీవల బ్రిటిష్ ఫెమినిస్ట్ డాక్టర్ విక్టోరియా బెట్మాన్ కూడా బీబీసీ రేడియో4 కార్యక్రమంలో ఇలానే చేసింది. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడే ఆమె.. ఈసారి బ్రెక్సిట్ కోసం తన నగ్నత్వాన్ని ప్రదర్శనకు పెట్టింది.

ఇప్పుడు జాన్సన్ కూడా విక్టోరియానే ఆదర్శంగా తీసుకుందని ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇంత పిచ్చా అంటూ విమర్శలు రావడంతో.. జాన్సన్ వెంటనే తేరుకుని ఒక ట్వీట్ చేసింది. ‘నేనా సమయంలో పూర్తి నగ్నంగా లేను. చనుమొనలు కనిపించకుండా ట్యూబ్స్ వేసుకున్నాను’ అంటూ జస్టిఫై చేసుకుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *