చిలుక పలుకులు, కోయిలమ్మ రాగాలు.. అంటూ పక్షుల భాష, యాసల గురించి చెప్పుకోవడమే తప్ప.. వాటిని అర్థం చేసుకోవడం మన వల్లయ్యే పని కాదు. కానీ.. గాల్లో ఈగలు, నీళ్లలో చేపలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఒకదాని భాష మరొకటి ఎలా గుర్తించగలుగుతుంది? ఈ రకమైన రీసెర్చ్‌లో ముందడుగు పడింది. రెండు భిన్నమైన జంతు-కీటక జాతుల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సక్సెస్ సాధించారు సైంటిస్టులు. కొన్ని ప్రత్యేక రోబోటిక్ ఇంటర్ ప్రిటర్స్‌ని వాడటం ద్వారా ఈ ప్రక్రియ సాధ్యమైందట.

ఈగలు- చేపల బయోసిగ్నల్స్‌ని క్యాప్చర్ చేసి.. రెండింటికీ అర్ధమయ్యేలా ఒక లాంగ్వేజ్‌లోకి మార్చడమే ఈ ప్రయోగానికి మూలం. ఈగ లోపల ఏర్పాటు చేసిన టెర్మినల్.. దాని రెప్పల కదలికల్ని, పరిసరాల్లోని ఉష్ణోగ్రతల్ని గ్రహిస్తుంది. చేప అంతర్భాగంలో ఎంబెడ్ చేసిన స్పై రోబో.. ఆ చేప రంగు, అది కదిలే వేగం, కదలికల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ.. తద్వారా ఈగతో సంభాషిస్తుంది. ఈవిధంగా.. రెండూ పరస్పరం భావాల్ని పంచుకోవడం సాధ్యమవుతోందని ప్రాధమిక ఫలితం తేల్చింది.  ఈ రకమైన సాంకేతికత జంతువుల సహజ స్వభావాల్ని పరిస్థితులకు అనువుగా మార్చుకునేందుకు ఉపయోగపడ్తుందని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *