సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు మోదీ-షా పదునైన వ్యూహాలు, మరోవైపు రాహుల్ ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. అధికారంలోకి రాగానే తొలి సంతకం హోదాపైనేనని కుండబద్దలు కొట్టేశారు. తొలిసారి యూఏఈ టూర్‌కి వచ్చిన రాహుల్.. శుక్రవారం దుబాయ్‌లోని భారతీయ కార్మికులనుద్దేశించి ప్రసంగించారు.

ప్రత్యేకహోదా అనే బకాయిని చెల్లించాల్సివుందన్నారు. నాలుగున్నరేళ్లుగా భారతదేశం అసహనంతో బాధపడుతోందంటూ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశారు రాహుల్. నోట్లరద్దు, జీఎస్టీతో దేశం నాశనమయ్యిందని, నిరుద్యోగం అనే పెద్ద సమస్య దేశాన్ని ప్రధానంగా పట్టిపీడిస్తోంది. మనం తలుచుకుంటే చైనాను మించి ఉద్యోగాలు కల్పించగలమని, రెండోది రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం మరో హరిత విప్లవం రావాల్సిన అవసరం వుందని రాహుల్‌గాంధీ వక్కానించారు.

విదేశీ గడ్డపై రాహుల్ ఏపీ ఇష్యూ ప్రస్తావించడానికి కారణాలు చాలానే వున్నాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఓటర్లు అధికసంఖ్యలో వుండడం ఒకటైతే, గత ఎన్నికల్లో మోదీ కూడా ఏపీ ఇష్యూని ప్రస్తావించి ఓటర్ల మద్దతు సంపాదించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కార్ హోదాపై ప్లేటు ఫిరాయించిన విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. మొత్తానికి హోదా విషయాన్ని విదేశీగడ్డపై ప్రస్తావించి తెలుగు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *