ఓ వైపు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్.. మరోవైపు కార్తికేయ మ్యారేజ్‌తో బిజీ అయ్యాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. తాజాగా  కార్తికేయ- పూజా ప్రసాద్ వెడ్డింగ్ గురించి ఓ వార్త హంగామా చేస్తోంది. నిన్నటివరకు జనవరి ఐదున హైదరాబాద్‌లో కార్తికేయ పెళ్లి జరగనున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా డెస్టినేషన్ వెడ్డింగ్‌కే జక్కన్న ఫ్యామిలీ మొగ్గు చూపినట్టు సమాచారం.

డిసెంబర్ 30న జైపూర్ వేదికగా ఈ పెళ్లి జరగనుంది. అక్కడ ప్యారామౌంట్ హోటల్‌లో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 250 ఎకరాల్లో కట్టిన 7 స్టార్ లగ్జరీ ప్యారామౌంట్ హోటల్, మొఘల్ స్టయిల్ ప్యాలస్‌ని తలపించే విధంగా ఉంటుందట. బాహుబలి సెట్టింగ్‌ని తలదన్నేలా వేదికను నిర్మించనున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కొందరు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *