బాహుబలి 2 స్పీడ్.. దంగల్ ఔట్

బాహుబలి 2 రిలీజైన ఏడాది గడిచినా ఇంకా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే వుంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,700కోట్లకు పైగా వసూలు చేసింది. లేటెస్ట్‌గా ‘బాహుబలి-2’ను చైనాలో భారీ ఎత్తున విడుదలైంది.

ఫస్ట్ డే 2.85 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.19కోట్లు) వసూలు కొత్త రికార్డ్‌ని నెలకొల్పింది. అంతేకాదు ‘దంగల్‌’ను బీట్‌ చేసింది. ఈ చిత్రం 2.49 మిలియన్‌ డాలర్ల ఓపెనింగ్‌ సాధించింది. భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన ఇండియన్ సినిమాల జాబితాలో ‘బాహుబలి 2’ ది థర్డ్ ప్లేస్.

ఇక ఆమీర్‌ నటించిన మరో ఫిల్మ్ ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’కు 6.74 మిలియన్‌ డాలర్లతో ఫస్ట్ ప్లేస్ కాగా, ఆ తర్వాత ‘హిందీ మీడియం’ (3.39మిలియన్‌ డాలర్లు) కొనసాగుతోంది. ఫస్ట్ వీక్ ‘బాహుబలి2’ స్పీడ్‌కి మరిన్ని రికార్డు బద్దలవ్వడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు బయ్యర్లు.