టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ డ్రెస్ వ్యవహారంపై రెండురోజులుగా జరిగిన రచ్చ కొత్త మలుపు తిరిగింది. తన పోస్టుకు రియాక్ట్ అవుతూ ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్‌కు హాట్ రిప్లై ఇచ్చేసింది రకుల్. నీ తల్లి కూడా ఇంతేనా అంటూ రకుల్ ఇచ్చిన సదరు రిటార్ట్‌‌తో సోషల్‌మీడియాలో ఆమె పూర్తిగా కార్నర్ అయ్యింది. తనకు వ్యతిరేకంగా ట్రోలింగ్ తీవ్రంకావడంతో రకుల్ ‘అసలు విషయాన్ని’ బయటపెట్టింది. వాడు అన్నమాటల పూర్తి ట్వీట్ ఇదీ చదవండి అంటూ కామెంట్‌కు సంబంధించిన థ్రెడ్ స్ర్కీన్ షాట్‌ని పోస్ట్ చేసింది.తనను పచ్చి పచ్చిగా తిడుతూ రాసిన పోస్టుని షేర్ చేసుకుంది రకుల్‌. ‘వాళ్లు అటువంటి భాష వాడబట్టే నేను అంత సీరియస్‌గా రియాక్ట్ కావాల్సివచ్చింది’ అంటూ సమర్థించుకుంది రకుల్ ప్రీత్. దీంతో ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడుతుందా అనేది చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *