బాహుబలి తర్వాత మరో హిస్టారికల్ హిట్ కొడదామన్న కసితో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తీస్తున్న మహా మల్టిస్టారర్ ‘RRR’. ఆ సినిమాకు సంబంధించిన కథా నేపథ్యాన్ని ఇటీవలే వెల్లడించి సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన. మిగతా కాస్టింగ్ ఎంపిక విషయంలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. బిజీ షూట్స్‌తో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈ పీరియాడిక్ డ్రామాలో కొమరం భీం వేషంలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటిస్తున్నారు.

వీరిద్దరి గెటప్స్ విషయంలోనూ కొన్నాళ్లుగా దోబూచులాట జరుగుతోంది. ముఖ్యంగా అల్లూరిగా చెర్రీ ఎలా ఉంటాడన్న క్యూరియాసిటీ మాత్రం పీక్స్‌లోకి చేరింది. ఈ గ్యాప్‌లోనే.. చెర్రీ కజిన్ వరుణ్ తేజ్ సీన్లోకొచ్చేశాడు. ఇడిగో నా జిగ్రీ బ్రదర్.. అంటూ ఒక రెస్టారెంట్‌లో చెర్రీతో కలిసి తీసుకున్న సెల్ఫీ  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కోల మొహం.. కోర మీసాలతో చరణ్ ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. ‘రాజమౌళి మా హీరోని భలేబాగా మార్చేశాడే’ అంటూ ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్. కానీ.. ఎంతో గోప్యంగా ఉంచుతూ వచ్చిన తమ హీరోల న్యూ లుక్స్ ఇలా బైటపడ్డం రాజమౌళి యూనిట్‌కి ఇబ్బందికరంగా మారుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *