రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాకు ఓ వైపు బ్యాడ్ రివ్యూలు వచ్చి పడుతుండగా..మరోవైపు పులిమీద పుట్రలా  ఇది మరో న్యూస్.. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ నవ్వుల పాలవుతుంటే డ్యామేజ్ కంట్రోల్‌కి పూనుకొన్నారట మేకర్స్. ఇందులో భాగంగా.. ఈ మూవీలో.. హీరో గుజరాత్ నుంచి నేపాల్ బోర్డర్ చేరుకోవడానికి ఓ బిల్డింగ్ మీదినుంచి మూవింగ్ ట్రెయిన్ పైకి దూకే సన్నివేశాన్ని కట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
చిత్రంలో ఇంత అసంబద్ధమైన సీన్ ని డైరెక్టర్ ఎలా జొప్పించాడో, హీరో ఎలా ఒప్పుకున్నాడో తెలియక అంతా అయోమయంలో పడిపోతున్నారు. అసలు ఈ సన్నివేశమే ఆడియెన్స్‌ని కట్టి పడేస్తుందని అనుకుంటే.. మొదటికే మోసం వచ్చి ఆన్‌లైన్ జోకుల కిందికి మారిపోయింది. చేసేది లేక మొత్తం ఆ యాక్షన్ సీన్‌కి కత్తెర పడక తప్పలేదట.. ఇంకా..ఇలాగే హీరో శత్రువులను నరికేస్తే  తెగి పోయిన తలలను గద్దలు ఎగరేసుకుపోవడం వంటి బోల్డన్ని సీన్స్ మీద కూడా కత్తెరవేటు పడుతుందేమో చూడాలి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *