'అందాల దేవత' ఇక లేదు!

శ్రీదేవి మృతిపై తన ఆవేదనను నిరంతర ట్వీట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నాడు ఆమె అపర అభిమాని, దర్శకుడు రాం గోపాల్ వర్మ. “సినీ దేవత అంతిమ నిష్క్రమణ ” అంటూ ఆమె అంతిమయాత్రకు సంబంధించిన ఫోటోల్ని పోస్ట్ చేస్తూ.. మరో మిస్టరీకి సైతం తెర తీశాడు. చిన్ని కృష్ణుని వేష ధారణలో ఉన్న చిన్నారి శ్రీదేవితో సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోను జత చేసిన వర్మ.. ఆమె పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని ఆ విధంగా వ్యక్తపరిచారు. అయితే ఇది ఏ సినిమాలోదో, ఏ సందర్భమో క్లారిఫై చేయలేదు. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది చిన్నారి శ్రీదేవేనా కాదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.