దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ఆర్‌‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ఇటీవల కొన్ని సన్నివేశాలను యూనిట్ షూట్ చేసింది. అయితే ఎలా లీక్ అయ్యాయోగానీ..ఈ మధ్యే..ఇది బ్రిటిష్ కాలం నాటి పోలీసు స్టేషన్ అంటూ సెట్స్ పై గల ఓ ఫోటో తాలూకు సీన్స్ లీకయ్యాయి. దీంతో అప్పుడే ఈ మూవీ దేశ స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి సంఘటనలతో కూడిన కాన్సెప్ట్‌తో కూడినదని మెలమెల్లగా ఫీలర్స్ బయలుదేరాయి. వాటికి ప్రూఫ్‌గా మరో కొత్త విషయం బయటికి వచ్చింది.

అదే… ఈ చిత్రంలో చెర్రీ మూడు పాత్రలు చేస్తున్నాడన్నది! ఇందులో రాంచరణ్.. బ్రిటిష్ అధికారిగా, మాస్ లీడర్‌గా, ఫ్రీడమ్ ఫైటర్‌గా ‘ త్రిపాత్రాభినయం ‘ చేస్తున్నాడట. మరి.. ఎన్టీఆర్ రోల్ గురించి తెలియాలంటే కాస్త వెయిట్ చేయక తప్పదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *