‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో చంద్రబాబు పాత్ర పోషిస్తోన్న రానా దగ్గుబాటి మరో లుక్ రిలీజ్ అయింది. డిసెంబర్ 13వ తేదీ రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మూవీ యూనిట్ ఈ కొత్త స్టిల్ విడుదల చేసింది. చేయి చాచి మాట్లాడుతున్నట్టుగా ఉన్న రానా ఫొటో రానా ఫ్యాన్స్ నే కాదు, అటు నందమూరి అభిమానులను కూడా విశేషంగా అలరిస్తోంది. కాగా, బాలకృష్ణ ఎన్టీఆర్‌ గా నటిస్తోన్న ఈ బయోపిక్ ను రెండు పార్ట్స్ కింద తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఎన్టీఆర్ సినీ కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ సాగిన జీవితాన్ని ‘కథానాయకుడిగా’, ఆ తర్వాతి నుంచి ఆయన చనిపోయే నాటి వరకూ కథను ‘మహా నాయకుడు’ రెండు సినిమాలు గా చూపించబోతున్నారు. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ జనవరి 9న రిలీజ్ అవుతుండగా, ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ జనవరి 24న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్స్మ్‌ బ్యానర్లో నందమూరి బాలకృష్ణ ఈ సినిమా నిర్మిస్తుండగా, వారాహి చలన చిత్ర, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. కీరవాణి సంగీతం. డిసెంబరు 16న ట్రైలర్‌, డిసెంబరు 21న ఎన్టీఆర్ సొంతఊరు నిమ్మకూరులో ఆడియో విడుదల చేయబోతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *