అనుష్క- రానా కలిసి మరోసారి వెండితెరపై కనిపిస్తారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. రుద్రమదేవి, బాహుబలి సినిమాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు. తాజాగా వీళ్ల కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. హేమంత్ మధుకర్ డైరెక్షన్‌లో ‘సైలెంట్’ అనే ప్రాజెక్టు తెరకెక్కనుంది. నటుడు మాధవన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

మరో రోల్ కోసం రానాని యూనిట్ సంప్రదించి చర్చలు జరిపినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఆయన దాదాపుగా ఓకే చేసినట్టు తెలుస్తోంది. దీంతో రానా రోల్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ- కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలో జరగనుంది. అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *