వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతం ! కనీవినీ ఎరుగని ఘట్టం ! కొలంబియాలో 35 వారాల గర్భంతో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళ కడుపులో ప్రాణం పోసుకుంటున్న ఆడ శిశువులోనూ మరో గర్భాశయం  మెల్లగా డెవలప్ అవుతూవస్తోందట. సదరు మహిళకు స్కాన్ చేసి చూసిన డాక్టర్లు దీంతో షాక్ తిన్నారు. దాని నుంచి అంబెలికల్ కార్డ్ బేబీ గర్ల్ పేగులకు ఎటాచ్ అయి ఉందని, రెండు వారాల్లోనే ఇది 20 నుంచి 30 శాతం పెరిగి.. ఆ చిట్టి గర్భాశయంలో కాళ్ళు, చేతులు కనిపించాయని వారు తెలిపారు.

అయితే మెదడు గానీ, గుండె గానీ కనిపించలేదన్నారు. శిశువు కడుపులో మరో చిన్న శిశువు రూపంలో ఇది పెరుగుతుండడంతో   (కవలల్లా)  ఆ మహిళకు బీపీ పెరిగి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. దీంతో డాక్టర్లు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి 7 పౌండ్ల బరువున్న బిడ్డను తీశారు. ఆ వెంటనే శిశువులోని పిండాన్ని కూడా ఆపరేషన్ చేసి తొలగించారు. ఇలాంటిది అతి అరుదైన ఘటన అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నెల రోజుల వయసున్న బేబీ గర్ల్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని వారు అంటున్నారు. ఎప్పుడో 1808 లో ఇలాంటి సంఘటన జరిగిందని వారు గుర్తు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *