పెంగ్విన్.. దక్షిణ ధృవం  ప్రాంతంలోనే కనిపించే అరుదైన, అందమైన పక్షిజాతి! సముద్రపు ఒడ్డున అడుగులో అడుగేసుకుంటూ వడివడిగా నడిచే పెంగ్విన్ పక్షులంటే ఎవరికైనా చూడముచ్చటే! రంగు పరంగా కూడా వీటికో విలక్షణత వుంది. నలుపు-తెలుపు కలగలసిన రెక్కలు పెంగ్విన్ పక్షుల సూపర్ స్పెషాలిటీ! కానీ.. బీబీసీ వాళ్ళు ఒక అచ్చమైన సింగిల్ కలర్ పెంగ్విన్‌ని అంటార్కిటికా ప్రాంతంలో పసిగట్టేశారు.

రెండు వైపులా బూడిద రంగుతో కూడిన రెక్కలతో ఒక ‘పెద్దన్న’లా హుందాగా నడుచుకుంటూ వెళ్తున్న ‘ఎంపరర్ పెంగ్విన్’ బీబీసీ ఎర్త్స్ వైల్డ్‌లైఫ్ షోలో హల్చల్ చేస్తోంది. మిగతా పెంగ్విన్‌లకు దీనికీ స్పష్టమైన తేడా ఉందని, జన్యుమార్పిడి ద్వారా వీటి పుట్టుక జరిగిందని బీబీసీ చెబుతోంది. ప్రపంచంలోకెల్లా ఈ రకమైన పెంగ్విన్ ఇదొక్కటేనని కూడా దండోరా వేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *