బుల్లితెర చిన్నది రేష్మీ గౌతమ్ అప్పుడప్పుడూనైనా ‘బైటి’ విషయాల్ని కెలకడం అలవాటుగా చేసుకుంది. స్వతహాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే రేష్మి.. సినిమాతో పాటు సామాజిక అంశాల్ని కూడా టచ్ చేస్తూ.. ఫాలోయర్లలో ఉత్తేజం నింపుతోంది. తాజాగా.. పుల్వామా ఉగ్రదాడి మీద రేష్మీ స్పందన హైపరాక్టివ్ మోడ్‌లో వుంది. తీవ్రవాదుల్ని సమర్థించేవాళ్లను చెండాడడంతో పాటు.. పేట్రియాటిక్ వీడియోస్‌ని షేర్ చేస్తూ తనలోని అగ్రెసివ్‌నెస్‌ని చాటుకుంది.

ఇదే క్రమంలో.. ఒక నెటిజన్ ఆమెను ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించాడు. ”పుల్వామా దాడి మోదీ చేయించిందేనన్న మమతా బెనర్జీ కామెంట్‌ని ఏపీ సీఎం చంద్రబాబు సమర్థించారు.. దీనికి నువ్వెలా స్పందిస్తావు..” అన్నది సదరు నెటిజన్ ప్రశ్న. దీనికి రేష్మి రెచ్చిపోకుండా తెలివిగా స్పందించింది. ‘మీ లీడర్-మీ ఇష్టం’ అనే అర్థం వచ్చేలా రియాక్ట్ అయి.. ఎస్కేప్ అయింది.

అతడు అక్కడితో వదలకుండా.. ”నీ ఓపెన్‌నెస్‌ని ఇష్టపడడం వల్లే అడుగుతున్నా.. పుల్వామా ఎపిసోడ్ మీద లోకల్ లీడర్ కామెంట్ నిన్నేమీ కదిలించలేదా?” అంటూ రొచ్చులోకి లాగడానికి ప్రయతించాడతడు. అయినా రేష్మి లొంగలేదు. ”రాజకీయాల జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే అక్కడ ఎవరి ఎజెండా వాళ్ళకుంటుంది. నా దేశాన్ని వ్యతిరేకించేవాళ్ల మీద మాత్రమే నాకు మంట” అంటూ అతడికి కత్తెరేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *