రేష్మీ చెప్పిన నీతి సూత్రం!

గ్లామరస్ డాళ్, బుల్లితెర రాణి రేష్మి గౌతమ్.. తన అందచందాలతోనే కాక, వచ్చీరాని తెలుగుతో చేసే యాంకరింగ్‌తో ప్రేక్షక లోకానికి బాగా దగ్గరైంది.. వయా జబర్దస్త్! కుర్రకారు దగ్గరైతే రేష్మీకుండే ఓటుబ్యాంకు మరీ పెద్దది. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన కరిష్మాను ‘తెలివి’గా వాడుకుని మరింత ఎదగాలన్న స్ట్రాటజీ రేష్మీది. కొన్ని సినిమాల్లో విభిన్నమైన రోల్స్ వేసి.. ఎక్స్‌పోజింగ్ విషయంలో వెనక్కు తగ్గకుండా ప్రయత్నించినా ఆమె ‘ఎదగలేక’పోయింది. అడపాదడపా సోషల్ మీడియా ద్వారా సొంత పిక్స్‌తో చేసే ప్రయోగాల మీద నమ్మకం పెట్టుకుంది. తన గ్లామరస్ ప్రాపర్టీకి కొన్ని ఇంటిలిజెంట్ కామెంట్స్ జోడించి.. నెటిజన్ల బుర్రల్ని వేడెక్కించడం రేష్మి ఎంచుకున్న కొత్త ఎత్తుగడ. కిందికి చూడకండి.. అగాధంలో పడిపోగలరు. పైకి చూస్తేనే ఆశీస్సులు దొరుకుతాయి.. అంటూ ఒక సెల్ఫ్ పిక్‌ని ఎటాచ్ చేసిన రేష్మీ తాజా పోస్ట్.. ఫాలోయర్లలో మేథోమధనానికి దారితీసింది. అబ్బో.. రేష్మీ బుర్రే బుర్ర.. అంటూ కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు.. ఆమె ‘అభిమాన జనం’.