పాత నోట్ల రద్దు మీద రిజర్వ్ బ్యాంకు నోరేత్తలేదని ఓ ఆర్ టీ ఐ యాక్టివిస్ట్ మండిపడుతున్నాడు. 2016 నవంబర్ 8న ప్రధాని మోదీ అంత ఆకస్మికంగా ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందో, అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో తెలుసుకునేందుకు ఈ యాక్టివిస్ట్ ప్రయత్నించాడు. అంతకుముందు ఆర్ బీ ఐ బోర్డ్ సమావేశమై పాత నోట్ల రద్దుకు సంబందించి విధివిధానాల మీద కసరత్తు చేసిందని, అప్పటి గవర్నర్ తనకు ఇష్టం లేకున్నా ఇందుకు ఆమోద ముద్ర వేశారని తనకు తెలిసిందన్నాడు.

నోట్ల రద్దు వల్ల కలిగే పరిణామాలను రిజర్వ్ బ్యాంకు మోదీకి వివరించబోయినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్న అంశం తనకు లభించిన సమాచారం బట్టి వెల్లడైందని, అసలు సంబంధిత సమాచారాన్ని ఆర్ టీ ఐ చట్టం ద్వారా అందజేసేందుకు ఈ బ్యాంకు నిరాకరించిందని ఆయన పేర్కొన్నాడు. నోట్ల రద్దు ప్రకటించిన వెంటనే ఏ టీ ఎం లు, బ్యాంకుల ముందు పెద్ద క్యూలు, వృద్ధులు, మహిళల పాట్లు చూసి కలత చెందిన తాను ఈ చట్టం కింద సమగ్ర సమాచారాన్ని తెలుసుకోగోరానని ఈ యాక్టివిస్ట్ పేర్కొన్నాడు. మోదీ ప్రభుత్వ చర్య ఫలితంగా ఇప్పటికీ దేశ ఆర్ధిక పరిస్థితిపై దీని తీవ్ర ప్రభావం కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *