టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. నాగబాబు తనను మోసం చేశాడని భావిస్తున్న నటుడు,  ‘మా’  మాజీ అధ్యక్షుడు శివాజీరాజా త్వరలో వైసీపీలో చేరుతున్నారు. (తాజాగా నాగబాబు నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున బరిలో నిలవబోతున్న విషయం తెలిసిందే).  ‘మా’  అధ్యక్ష ఎన్నికల్లో నాగబాబు చివరి నిముషంలో మనసు మార్చుకుని టీడీపీ అనుకూలవర్గమని భావిస్తున్న నరేష్ పానెల్ కి మద్దతు తెలపడంతో శివాజీరాజా మండిపడినట్టు కనిపిస్తోంది.. అందువల్లే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే యోచన తనకు లేకున్నా.. వైసీపీలో చేరి నాగబాబుకు వ్యతిరేకంగా  ప్రచారం  చేస్తానని ఇదే తన రిటర్న్ గిఫ్ట్ అని చెబుతున్నాడు. మొత్తానికి టాలీవుడ్ అంతా పార్టీలుగా చీలింది. కొందరిది టీడీపీ అనుకూల వర్గమైతే,,మరికొందరిది వైసీపీ వర్గం..మరికొంతమందిది జనసేన వర్గంలా మారాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *