తన భర్త రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని ఆయన భార్య గీత పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ అరెస్టుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసేందుకు ఆమె బయల్దేరగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. మీరు వెళ్ళడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని వారించారు. అయితే వారితో వాగ్యుద్ధానికి దిగిన గీత.. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని నిలదీశారు. 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన ఆమె..నేనూ ఆ సభకు వెళ్తా అని చెప్పేసరికి పోలీసులు షాక్ తిన్నారు. అయితే ఆ సభకు అన్ని అనుమతులూ ఉన్నాయని వారు చెప్పడంతో.. ఆ సభకు వెళ్లేందుకు తనను కూడా అనుమతించాలని డిమాండ్ చేశారు. కాగా-వారంటూ లేకుండా ఖాకీలు అర్దరాత్రి తమ ఇంటి పడక గదిలోకి చొచ్చుకురావడాన్ని గీత ఖండిస్తూ..వీరి తీరు అనుమానాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. కాగా-రేవంత్ అరెస్టుపై కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆయన కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *