చంద్రుడు, అంగారక గ్రహాల పైకి వ్యోమగాములను పంపుతానని అదే పనిగా ఊదరగొడుతున్న స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్‌మస్క్… ఈసారి భాషకు సంబంధించిన టెక్నాలజీ మీద దృష్టి పెట్టాడు. ఆయన ఆధ్వర్యంలో పని చేస్తున్న ఏ 1 రీసెర్చ్ గ్రూప్ దీన్ని కనుగొంది. ఈ కృత్రిమ ఇంటలిజెన్స్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని ఈ గ్రూప్ చెప్పుకుంది. అయితే డెవలపర్లు దీన్ని ప్రస్తుతానికి రిలీజ్ చేయడంలేదు. అలా చేస్తే ఇది దుర్వినియోగం కావచ్చునని, ప్రమాదాలకు దారి తీయవచ్చునని భయపడుతున్నారు. కేవలం సింపుల్ హెడ్ లైన్స్ నుంచి న్యూస్ స్టోరీలను (వార్తా కథనాలను) జనరేట్ చేయగల ఈ నవీన లాంగ్వేజ్ మోడల్ కి ఇతర ప్రొఫెసర్లు, మేధావుల మద్దతు కూడా లభించింది.

ఇప్పుడే ఈ భాషా వివరాలను తాము విడుదల చేయడం లేదని, అయితే రీసెర్చ్ కార్యక్రమాలకోసం చిన్నపాటి వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నామని ఎలన్ మస్క్, సహా దీని సృష్టికర్తలు పేర్కొంటున్నారు. రానున్న కాలంలో ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అవుతుందని, నెగెటివ్ అప్లికేషన్స్ పై పరిశోధకులు కూలంకషంగా చర్చించినతరువాతే ఈ ప్రాజెక్టు ఫుల్ డీటైల్స్, స్పెసిఫికేషన్లను ప్రకటిస్తామని డెవలపర్లు తెలిపారు. తమ బ్లాగ్ లో ఈ రీసెర్చ్ బృందం.. సింపుల్ హెడ్ లైన్స్‌కి సంబంధించిన వార్తా కథనాలను శాంపిల్‌గా చూపింది.

సిలికాన్ వ్యాలీలోని ప్రముఖులు చాలామంది దీనికి సపోర్ట్ ప్రకటించారు. ఈ కొత్త మోడల్ ని  జీపీటీ-2‌ గా వ్యవహరిస్తున్నారు. పత్రికా ప్రకటనల నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా వార్తా కథనాలను అల్లగలిగే కంప్యూటర్లు ఉన్న ఈ కాలంలో ఇదే తరహా టెక్నాలజీని వీళ్ళు వినియోగించారు. కేవలం రెండు లైన్ల హెడ్‌లైన్స్ ఆధారంగా 9 పేరాల వార్తను ఈ ప్రోగ్రాం లో వీళ్ళు నిక్షిప్తం చేశారు. ఇంటర్నెట్ లో లభ్యమయ్యే టెక్స్ట్‌ను వాడడం ద్వారా సుదీర్ఘమైన సమాచారాన్ని ఈ భాషా మోడల్ ఇవ్వగలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు షార్ట్ హ్యాండ్ ద్వారా సమాచారం మొత్తాన్ని సంగ్రహించగలిగే వాళ్ళం. అయితే అది మ్యాన్యు వల్..ఇప్పుడు ఈ రీసెర్చర్లు..కంప్యూటర్ పై అదే పని చేయబోతున్నారు. జస్ట్..టూ హెడ్ లైన్స్ ! కంప్లీట్ స్టోరీ ! వారెవా ! రెండు లైన్ల స్టోరీలో ‘ దాగి ఉన్న ‘ కథనమంతా బయటికి వచ్చేస్తుందన్న మాట !

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *