ఎన్టీఆర్- రామ్‌చరణ్ కాంబోలో రానున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని  దేశవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది యూనిట్. మార్చిలో చెర్రీ, మే లో తారక్ బర్త్ డే సందర్భంగా, వాళ్ల లుక్స్, టీజర్స్ రిలీజ్ చేసే అవకాశం వుందా? అన్న ప్రశ్నకు జక్కన్న తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశాడు. చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తామని చెప్పిన ఆయన.. చాలా సమయం ఉన్నందున టీజర్‌లు, ఫస్ట్‌లుక్‌లు ఉండబోవంటూ లైట్‌గా స్మైల్ ఇచ్చి అభిమానుల ఆశలపై నీళ్లు జల్లాడు. ఇప్పుడే వాటిని రిలీజ్ చేయడం టూ ఎర్లీ అవుతుందన్నాడు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మూవీకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు తర్వాత కోల్‌కతాకు వెళ్లనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *