వైఎస్ వివేకానంద హత్య కేసులో  సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. వివేకా ప్రధాన అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. హత్యకు ముందు, ఆ తర్వాత ఈ నేతలిద్దరి మధ్య తరచూ ఫోన్‌ సంభాషణ జరిగినట్టు తేలడంతో అటువైపు దృష్టి పెట్టింది. అటు వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారిస్తోంది. వీళ్లతో కడప జిల్లాకు చెందిన కొంతమంది టీడీపీ నేతలు మాట్లాడినట్టు వార్తలు హంగామా చేస్తున్నాయి.

హత్యకు 15 రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వివేకా- గంగిరెడ్డి- పరమేశ్వర్‌రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీల గ్యాప్ వచ్చినట్టు గుర్తించారు. బెంగుళూరులో రూ.125 కోట్ల ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో వివేకా- గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. వివేకాకు తెలియకుండానే నాలుగైదు ఎకరాలు అమ్మే ప్రయత్నం చేశాడని, అందుకుగాను గంగిరెడ్డికి కోటి 75 లక్షలు వచ్చిందట. ఈ విషయం బయటపడితే.. హత్యకు సూత్రదారి ఎవరన్నది తేలనుంది. దీంతో భూ వివాదం వివేకానందరెడ్డితోపాటు ఎవరికి మధ్య నడుస్తుందనేది తేలనుంది.

అంతేకాదు వివేకా హత్యకు 15 రోజుల ముందు ఆయన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా చనిపోయింది. మరోవైపు నాలుగురోజులుగా రహస్య ప్రాంతంలో గంగిరెడ్డిని విచారిస్తోంది సిట్. ఆయన చెప్పిన వివరాలు ఆధారంగా పరమేశ్వర్‌రెడ్డిని విచారించనున్నారు. అటు అవినాష్‌రెడ్డి, వివేకానంద భార్య నుంచి కూడా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *