టికెట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పులు-చేర్పులతో అయోమయం నెలకొనడంతో ఈ పంచాయితీలు అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లాయి. తాజాగా మంగళవారం ఉదయం అమరావతిలో మాజీ ఎంపీ సబ్బంహరి.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. నేతలిద్దరి మధ్య సీట్లు కేటాయింపు అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. భీమిలి సీటు కేటాయింపుపై ఆయన కొంత అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. గతరాత్రి వెల్లడించిన టీడీపీ ఫైనల్ జాబితాలో సబ్బంహరికి భీమిలి సీటును హైకమాండ్ కేటాయించింది. ఆయన మాత్రం విశాఖ ఎంపీ టికెట్ కోరుతున్నారు. ఆ స్థానాన్ని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు కేటాయించాలని ముఖ్యనేతలు ఒత్తిడి చేయడంతో ఆయనకి సీటు ఓకే చేశారు చంద్రబాబు. బాబుతో భేటీ తర్వాత హరి కన్విన్స్ అయినట్టు తెలుస్తోంది.

రీసెంట్‌గా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ హర్షకుమార్‌కు అమలాపురం ఎంపీ సీటు ఇస్తారని భావించారు. కానీ, చివరినిమిషంలో దివంగత జీఎంసీ బాలయోగి కొడుకు హరీష్‌కు అధిష్టానం ఖరారు చేసింది. ఈ విషయంలో హర్షకుమార్ కాస్త అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నుంచి గాదె వెంకటరెడ్డి, సతీష్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేతలిద్దరు కూడా ఉదయం అధినేతతో భేటీ అయ్యారు. వాళ్లని బాబు బుజ్జగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *