కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి..టీ ఆర్ ఎస్ లో చేరికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 10 న ఆమె తన
తనయుడు కార్తీక్ రెడ్డితో బాటు ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ సమక్షంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ కాగా..ఇక ఆమె తెరాసలో చేరిక ఖాయమనే వార్తలు వచ్చాయి.

అయితే మరుసటి రోజే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడంతో సబిత వెనక్కి తగ్గారని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగవచ్చుననే ప్రచారం కూడా సాగింది. కానీ బుధవారం మళ్ళీ ఆమె తెరాస అధిష్టానంతో సమావేశం కావడంతో తిరిగి తెరాసలో చేరిక వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి గురువారం తన కుమారుడితో బాటు తెరాస నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగెల కృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలా వద్దా ఆన్న మీమాంశలో తెరాస హైకమాండ్ ఉన్నట్టు సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *