అబ్బో ఒక‌టా.. రెండా.. అర‌డ‌జ‌న్ ఫ్లాప్‌లు. ఈ రేంజ్‌లో బాదితే.. ఎవ‌రైనా త‌ట్టుకుంటారా? దెబ్బ మీద దెబ్బ పడితే మళ్ళీ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడ్తుంది..? భీకరమైన స్లంప్ అంటే ఇదేనా? అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇదంతా మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గురించే. తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం, జ‌వాన్‌, ఇంటిలిజెంట్‌, తేజ్ ఐల‌వ్యూ.. ఇలా ఏకంగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బాల్చీ త‌న్నేయ‌డంతో బ‌య్య‌ర్లకి చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి. అందుకే సాయిధ‌ర‌మ్ తేజ్ మార్కెట్ ఇపుడు అమాంతం ప‌డిపోయింది.

సాయిధ‌ర‌మ్ తాజాగా న‌టించిన చిత్ర‌ల‌హ‌రి.. ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. ఈ సినిమాని ‘రంగ‌స్థ‌లం’ వంటి బ్లాక్‌బస్ట‌ర్స్‌ని అందించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ‘చిత్ర‌ల‌హ‌రి’ని టేకప్ చేసింది. అయినా బ‌య్య‌ర్లు మాత్రం కొనేందుకు ఎగ‌బ‌డ‌లేదు. బ్యాన‌ర్‌ని చూసి ఎలాగోలా కొనేశారు. కానీ చాలా తక్కువ రేట్‌కి. చిత్ర‌ల‌హ‌రి’ హక్కుల్ని ఏపీ, తెలంగాణ మొత్తం.. దాదాపు 10 కోట్ల రూపాయ‌ల‌కి కొన్నార‌ట‌. అందులోనూ రెండు కోట్లు రిట‌ర్న్ ఇచ్చేట్లుగా ముందస్తు ఒప్పందం కూడా. ఇదీ ఇపుడు సాయిధ‌ర‌మ్ తేజ్ మార్కెట్‌.

ఒక‌పుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాల‌ బిజినెస్ పాతిక కోట్ల వ‌ర‌కు అయ్యేది. ఇపుడు ఈ రేంజ్‌లో ప‌డిపోయింది. ల‌క్ బాగుండి చిత్ర‌ల‌హ‌రి హిట్టయితే మ‌ళ్లీ సాయిధ‌ర‌మ్ మార్కెట్ పుంజుకుంటుంది. కిషోర్ తిరుమ‌ల డైర‌క్ట్ చేసిన ఈ మూవీలో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇచ్చాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *