మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా టాలీవుడ్, కోలీవుడ్‌ని ఒక ఊపు ఊపి.. తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. షూటింగ్ ఎట్మాస్పియర్ విషయానికొస్తే ఎక్కడిక్కడ తేడాలుండడం సహజం. హీరోయిన్ల పట్ల మేల్ సెలబ్రిటీలు వ్యవహరించే తీరును కథలుకథలుగా చెప్పుకుంటారు. తాజాగా.. తమన్నా తన బాలీవుడ్ ఎక్స్‌పీరియెన్సెస్‌ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సాజిద్ ఖాన్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ”సాజిద్ నాతో ఎప్పుడూ మిస్‌బిహేవ్ చెయ్యలేదు. అతడి విషయంలో నాకు ఏవిధమైన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లేదు” అన్నదామె.

సాజిద్ ఆడాళ్ళ పట్ల ఛండాలంగా ప్రవర్తిస్తాడని, అతడితో ఇకముందు సినిమాలు చేయబోనని విద్యాబాలన్ ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ గుర్తు చేసినప్పుడు.. ”అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. ఆమెకు అటువంటి సందర్భం ఎదురై వుండొచ్చు. నాకు మాత్రం సాజిద్ మంచి బాలుడు” అనేసింది. ‘మీటూ’ మూమెంట్ నేపథ్యంలో సాజిద్ మీద తీవ్రమైన ఆరోపణలొచ్చాయి.

తమను లైంగికంగా వేధించేవాడంటూ సాజిద్‌పై.. సలోని చోప్రా, రాచెల్ వైట్, కరిష్మా ఉపాధ్యాయ్.. అభియోగం మోపారు. ఆ దెబ్బతో బాలీవుడ్ మొత్తం సాజిద్‌పై కక్ష గట్టినంత పని చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం అతడి నెత్తిన పాలుపోసేసింది. గతంలో హిమ్మత్ వాలా, హమ్ షకల్స్ సినిమాల కోసం వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *