సుధీర్‌బాబు ‘సమ్మోహనం’ అంతా రెడీ

సుధీర్‌బాబు- అదితీరావ్ హైదరీ జంటగా రానున్న మూవీ సమ్మోహనం. షూటింగ్ ఫినిష్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది యూనిట్. తొలుత మే థర్డ్ వీక్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. ఇప్పుడు జూన్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నవతరం లవ్‌స్టోరీతోపాటు హాస్యం, ఫ్యామిలీ రిలేషన్ షిప్ వంటి అంశాలు వుంటాయని చెబుతోంది యూనిట్. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నాడు.