ఉగ్రమూకల దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో యావత్ భారతావని విషాదంలో మునిగిపోయింది. దీంతో వీర మరణం పొందిన సైనికులకు భారత ప్రజలందరూ నివాళులర్పిస్తున్న సమయంలో టెన్నిస్ ప్లేయర్ సానియామీర్జా చేసిన ఓ పోస్ట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. తన చెల్లెలు ఫ్యాషన్ డిజైనర్ అనమ్ మీర్జా రూపొందించిన దుస్తులను ధరించిన సానియా, అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

దేశం తరపున ఆడుతున్న ఓ క్రీడాకారిణి ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏమిటని నెటిజన్స్ సానియాను తీవ్ర పదజాలంతో దూషిస్తూ టార్గెట్ చేశారు. మరొకరు ఎవరైనా అయితే ట్రోలింగ్ తక్కువగా ఉండేదేమో! పాక్ క్రికెటర్ షోయబ్‌ను ఆమె పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు సీరియస్‌ రియాక్ట్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సైనికులకు సానుభూతి ప్రకటిస్తూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, దేశం పట్ల కృతజ్ఞత లేదు.. హేట్ యూ అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు. పేరు తెచ్చుకోవడం కోసం భారత జెండా ఉపయోగించావని, భారతీయులు ఆమెని అన్‌ ఫాలోకండి.. అని మరొకరు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో పుల్వామా దాడి ఘటనను ఖండిస్తూ సానియా ఓ ట్వీట్ చేసింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *