సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరి వెళ్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. అటు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. దీంతో ఊర్లకు వెళ్లే వాళ్ల వాహనాలతో హైదరాబాద్ -విజయవాడ హైవేపై రద్దీ అమాంతంగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దాదాపు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడినట్టు తెలుస్తోంది.

తాకిడిని తట్టుకునేందుకు టోల్‌ప్లాజా అధికారులు అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడంలేదు. దీనికితోడు శనివారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *