ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి భారీ బల్లి శిలాజాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞులు.. దాని  వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ భూమ్మీద సుమారు 300 మిలియన్ ఏళ్ళ నాడు జీవించి ఉండేదని  భావిస్తున్న 5 అడుగుల పొడవైన బల్లి కాలక్రమంలో అంతరించిపోయింది. జర్మనీలోని ఓ అటవీ ప్రాంతంలో దాదాపు రెండు వారాల క్రితం పరిశోధనలు జరుపుతున్న సైంటిస్టులకు ఈ బల్లి శిలాజం కనబడగానే వారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది.
దీని జాతిని ‘ ఒరోబెట్స్ ‘ గా వారు గుర్తించారు. భూమిపై అతివేగంగా నడవడమే గాక, నీటిలో కూడా ఈదగలిగేదని వారు కనుక్కున్నారు. తమకు కనబడిన ఈ శిలాజ స్ఫూర్తితో.. ఓ రోబోనే వారు సృష్టించారు.
నాటి రాకాసి బల్లులు, ఇతర ప్రాణుల రోబోలను సృష్టించడానికి ఇది తోడ్పడిందని సైంటిస్టులు చెబుతున్నారు. డిజిటల్ స్కాన్లను, కంప్యూటర్ సిమ్యులేషన్స్ ను వినియోగించి ‘ బల్లి రోబో ‘ ను రూపొందించారు. జర్మనీలో ఇంకా ఇలాంటి పరిశోధనలు, రోబోల సృష్టికి మరిన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *