జన్యువులను కొత్తగా కలపడం, మార్చడం, లేదా తొలగించడం వంటి ప్రక్రియలపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుట్టే పిల్లలు మనం కోరుకున్న విధంగా ఉండాలంటే.. ఆవిధంగా ‘ డిజైన్ ‘ చేయాలంటే జన్యు ఎడిటింగ్ మేలని చైనా రీసెర్చర్లు ఆ మధ్య పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే ఇది పెను వివాదానికి దారి తీసింది. హెచ్‌ఐవీ నిరోధక శక్తిని కల్పించాలంటే డీ‌ఎన్‌ఏ ని మార్చడం ద్వారా కవల పిండాలకు కొత్త రూపు కల్పించ వచ్చునని చైనా శాస్త్రజ్ఞులు లోగడ ప్రకటించారు. అయితే ఈ జీన్ ఎడిటింగ్ మేలు కన్నా కీడే చేస్తుందని, మానవ జాతికి కొత్త పరిణామ క్రమాన్ని కలిగించాలన్న యోచనను ఇది నీరు గారుస్తుందని అంటున్నారు. దీనివల్ల ఉపయోగం లేదని అమెరికా, కెనడా, జర్మనీ దేశాల రీసెర్చర్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను ఓ పత్రికలో పేర్కొన్నారు.

కనీసం ఈ ప్రయోగాన్ని తాత్కాలికంగానైనా బ్యాన్ చేయాలన్నారు. జీన్ ఎడిటింగ్ కంట్రోల్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలు, సూచనలు అవసరమన్నది వారి వాదన. జీన్‌ని మ్యానిప్యులేట్ చేయడంవల్ల కలిగే విపరీత పరిణామాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

హెచ్‌ఐవీ నిరోధక శక్తి కలిగినవారిగా కవలలను చేసేందుకు తాను డీ‌ఎన్‌ఏ ని మార్చానని చైనా సైంటిస్టు ఒకరు గత నవంబరులో ప్రకటించాడు. అయితే ఇది చట్ట విరుద్ధమంటూ ఆ దేశ ప్రభుత్వం అతని ఇన్వెస్టిగేషన్‌పై పోలీసు విచారణకు ఆదేశించింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *