రియల్ లైఫ్ లో దంపతులైన నాగచైతన్య, సమంత రీల్ లైఫ్‌లో కలిసి కనిపిస్తున్న ‘మజిలీ’ మూవీ టాలీవుడ్‌లో ప్రస్తుతానికి మోస్ట్ వాంటెడ్ మూవీ. డైరెక్టర్ శివ నిర్వాణ సొంత కథను తెరకెక్కిస్తున్న మజిలీ మూవీని షైన్ స్క్రీన్స్ అనే బేనర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకి సంబంధించి ఒక హృద్యమైన లిరికల్ థీమ్ సాంగ్ విడుదలైంది.

డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్‌కి గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ‘ఏడెత్తు మల్లెలే’ అనే లీడ్‌తో సాగిన ఈ పాట వినసొంపుగా వుంది. లిరిక్స్‌లో డెప్త్ వున్నట్లే.. ఆకట్టుకునే మెలోడీతో సాగింది. ఈ రెండో పాటలో సమంత అప్పియరెన్స్ లేకపోయినా.. మూవీలో చైతూతో ఆమె కెమిస్ట్రీ బాగా పండినట్లు చెబుతున్నారు. చైతూ, సమంతాలతో పాటు ఇందులో దివ్యాంశ కౌశిక్, రావు రమేష్ మిగతా లీడ్ రోల్స్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘ప్రియతమా ప్రియతమా’ పాట ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య సినిమాల్లో కలిసి నటించిన ఈ లక్కీ కపుల్.. పెళ్లయిన తర్వాత మొట్టమొదటి సరిగా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. నానికి ‘నిన్నుకోరి’తో హిట్ ఇచ్చిన శివ నిర్వాణ ‘మజిలీ’తో మరోసారి ప్రూవ్ చేసుకోడానికి తహతహలాడుతున్నాడు. ఏప్రిల్‌ 5న ‘మజిలీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *