సెల్ఫ్ హార్మింగ్.. మనల్ని మనమే గాయపర్చుకోవడమనే ఒక రకమైన మానసిక వ్యాధి. యువత ప్రాణాలు తీసే అనేక కారణాల్లో ఇదీ ఒకటి. ఏటా ఇండియాలో కనీసం 60 వేల మంది యువత ఈ సెల్ఫ్ హార్మింగ్ అనే జాడ్యంతోనే మరణిస్తున్నట్లు హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ అనే సంస్థ లెక్క గట్టింది. చేతుల మీద బ్లేడుతో కోసుకోవడం, తలను గోడకేసి కొట్టుకోవడం, కాళ్ళను గాయపర్చుకోవడం లాంటి చర్యలు.. చూసి నేర్చుకునేవే తప్ప వాటంతటవే పుట్టేవి కావట. కుటుంబంలో గానీ, స్నేహితుల్లో గానీ ఈ అలవాటుండడాన్ని చూసి.. తానూ అలవర్చుకోవడం వల్ల టీనేజర్లలో ఈ రుగ్మత విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని ఢిల్లీలోని రికవర్ క్లినిక్ డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. తమకంటూ సొంత వ్యక్తిత్వాల్ని నిర్మించుకునే క్రమంలో చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా భరించలేనితనంతో కుర్రాళ్లు ఇటువంటి విపరీత ధోరణులకు పాల్పడతారట. కోరింది దొరకనప్పుడు.. భావోద్వేగాల్ని అణచుకోలేక, కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలీక ఇలా స్వయంహానికి పాల్పడడం అనేది ఒక సూపర్ సెన్సిటివ్ మెంటల్ డిజార్డర్. దీన్ని అదుపు చేయడానికి కొన్ని సరళమైన మార్గాల్ని సూచిస్తున్నారు సైక్రియాటిస్టులు.

  • వాతావరణాన్ని మార్చడం.. నివాసముండే ప్రాంతాన్ని వదిలి మరోచోటికి వెళ్లడం..!


  • తనకిష్టమైన మంచి సంగీతాన్ని వినడాన్ని అలవాటుగా మార్చుకోవడం..!


  • డ్రాయింగ్ మీద ఆసక్తిని పెంచుకోవడం.. కాగితాల మీద, వీలయితే వంటి కలర్ ఫుల్ స్కెచ్చులేయడం!


  • నువ్వు కోసుకుంటే నేనూ కోసుకుంటానంటూ అతడి మానసిక స్థితి మీద రివర్స్ ఎటాక్ చేయడం కూడా ఒక్కోసారి పరివర్తన తీసుకొస్తుందట!


  • ఇష్టమైన పెంపుడు జంతువుతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం.


  • దినచర్యలో క్రమంగా మార్పు తీసుకురావడం.. రోజుకో గంట సమయం యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి అలవాటు చేయడం.. అతడిలోని రోటీనిటీని దూరం చేస్తుంది. ఆవిధంగా వాళ్లలో మనో వికాసం కలుగుతుంది.


 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *