ఇండియా- అమెరికా చట్టాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు తిరుమల్ రెడ్డి. వ్యక్తి చనిపోయిన తర్వాత ఆస్తులను అప్పగింతలో వచ్చిన తేడాలు, ఆస్తులు ఎలా చేతులు మారుతాయి? ఆస్తుల మారడం ఎంత క్లిష్టంగా వుంటుందో ఆయన వివరించారు. డాలస్‌లో ‘టాంటెక్స్-నాట్స్ సంయుక్తంగా టాక్స్ & ఎస్టేట్’ పేరిట సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విచ్చేశారు మురళి, తిరుమల్ రెడ్డిలు. కొన్ని చట్టాల గురించి ఎన్నారైలకు వివరించారు. 2018 తర్వాత పన్నుల చట్టంలో వచ్చిన మార్పులు, న్యాయబద్దంగా మనీ ఆదా చేసే పద్దతులను వివరించారు. వీర్నపు చిన్నసత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *