రాజమౌళి- రామోజీరావు మధ్య తీవ్ర విభేదాలు.!

దర్శకధీరుడు.. జక్కన్న రాజమౌళి – మీడియా టైకూన్ రామోజీ రావు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరిపోయాయా? బాహుబలి సినిమా నిర్మాణ ఖర్చులకు సంబంధించి వీరిమధ్య తలెత్తిన ఆర్థికపరమైన తేడాలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయా? ఇక భవిష్యత్ లో సినిమాలేవీ రామోజీ ఫిల్మ్ సిటీలో చేసే ప్రసక్తే లేదని జక్కన్న నిర్ణయం తీసేసుకున్నాడా? రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆర్ఎఫ్‌సీ వేసిన 90కోట్ల రూపాయల బిల్లే కారణమా లేక మరో కోణం ఏదైనా ఉందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఈ రాద్ధాంతం ఇప్పుడు ఎందుకింత వైరల్ గా మారిందనే విషయానికొస్తే.. తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశాడు దర్శకుడు రాజమౌళి తన బాహుబలి సినిమాతో. అయితే, ఈ సినిమా నిర్మాణం చాలా వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. అక్కడ వేసిన సెట్టింగ్స్, వాడుకున్న స్డూడియోలకు సంబంధించి ఆర్ఎఫ్‌సీ, బాహుబలి నిర్మాణ సంస్థ అయిన ఆర్కామీడియాకు 90కోట్ల మేర బిల్ వేసినట్టు వెబ్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిని తీవ్రంగా తీసుకున్న రాజమౌళి భవిష్యత్ లో తన సినిమా షూటింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపబోనని నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఇలాఉంటే, దీనికి సంబంధించి ఆర్టికల్ రాసిన ఒక వెబ్ సైట్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  వ్యూస్ కోసం ఇలాంటి బుల్ షిట్ వార్తలు ప్రచురించొద్దంటూ కస్సుమన్నాడు. యాష్ ట్యాగ్ జోడించి, డిస్గస్టింగ్, ఎల్లోజర్నలిజం అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.