కేరళ సీనియర్ పొలిటీషియన్, మాజీ కేంద్ర మంత్రి శశి ధరూర్ ఆస్పత్రి పాలయ్యారు. తిరువనంతపురం లోక్ సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో వున్న థరూర్.. ఈ కీలక సమయంలో ఆస్పత్రి పడకపై వుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతకూ ఏమైంది అయనకు..?

తంపనూర్‌లోని గాంధారి అమ్మన్ కోయిల్ కెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం శశిథరూర్‌కి ఒక సెంటిమెంట్. ఈసారి ఎన్నికల ప్రచారం ఆ గుడి నుంచే మొదలుపెట్టాలనుకున్నారు. కానీ.. అక్కడే ఆయనకు అపశృతి జరిగింది. అమ్మవారికి అరటిపండ్లతో తులాభారం చేయించాలన్న ఉద్దేశంతో తక్కెడలో కూర్చున్నారు. కానీ.. బరువు తూగలేక ఆ త్రాసు కాస్తా ఊడిపోయింది. దభాల్న కింద పడ్డ శశి థరూర్‌ని ప్రాధమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ.. ఆయనకు అయింది మామూలు గాయం కాదని.. తలకు ఏకంగా 11 కుట్లు పడ్డాయని విశ్రాంతి అవసరమని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన జారీ అయింది.  నాలుగురోజుల పాటు ర్యాలీలు, సభలు రద్దయిపోయాయి.

ఇటీవలే శశి ధరూర్ ఈ గుడికి సంబంధించి ఒక తమాషా ట్వీట్ కూడా చేశారు. త్రాసులో కూర్చున్న పాత ఫోటో జత చేస్తూ.. ‘కనీసం ఇక్కడైనా రుజువవుతోంది నేనొక హెవీ వెయిట్ పొలిటీషియన్‌నని’ అంటూ ఛలోక్తి వేసుకున్నారు. అలా చమత్కారం చేయడం వల్లే అమ్మవారు కోప్పడి ఆయనకు అలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *