గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. ఏకాంతంగా వున్న ఓ ప్రేమజంటపై పైశాచికంగా దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే మరణించింది. ప్రియుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చారు పోలీసులు. ప్రియుడు శ్రీనివాసరావు ఫ్రెండ్స్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలడంతో వాళ్లని అరెస్ట్ చేశారు.


తాడేపల్లి మహానాడు ఏరియాకి చెందిన 26 ఏళ్ల చుంచు శ్రీను, ఎంఫార్మసీ చేసిన జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం సాయంకాలం మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్‌ స్టేడియం వెనుక వైపు వున్న ప్రాంతానికి ప్రేమికులు ఇద్దరు వచ్చారు. ఏకాంతంగా వున్న సమయంలో వాళ్లని గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితోవున్న శ్రీను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. జ్యోతి, శ్రీను సెల్ ఫోన్‌ కాల్‌లిస్ట్ ఆధారంగా వెంటనే నిందితులెవరో గుర్తించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *