వీకెండ్ వచ్చిందంటే చాలు ! ఆడా, మగా అంతా ఒక్కచోట చేరిపోతారు. మయామీ‌లోని సౌత్ బీచ్ అంతా సందడిగా మారుతుంది. ముఖ్యంగా..స్విమ్ సూట్లు, బికినీలు ధరించిన యువతుల కోలాహలం చెప్పలేం.. అయితే వీరంతా ఏ పిక్నిక్ బృందంలోని వాళ్ళో, షికారుకు వచ్చిన వాళ్ళో అనుకుంటే పొరబాటే.. కొద్దిసేపటికే ఆ బీచ్‌లో సీన్ మారిపోతుంది. ఒకరికొకరు పైనబడి కొట్టుకుంటారు..రక్కుకుంటారు. కేకలు పెడుతూ ఫైట్లకు దిగి..జుట్టూ జుట్టూ పట్టుకుని రంకెలేస్తారు. కొందరు రోడ్డు పైకొచ్చేసి..తన్నుకుంటారు.. ముష్టిఘాతాలూ..సరేసరి ! ఎవరిని ఎవరు కొడుతున్నారో..ఎందుకో అర్థం కాదు. మరి ఈ యువత అంతా మందు కొట్టి వచ్చి అక్కడ ఎందుకు రణరంగం సృష్టిస్తారో, వీరి ఉద్దేశమేమిటో అర్థం కాక పోలీసులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతి వీకెండ్ అక్కడ ఇదే సీన్ ! ఈ మూకను కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారు..ఈ ‘ వింత సరదా’ పోలీసుల ప్రాణం మీదికి వస్తోంది. ఇది చాలదన్నట్టు ఎవరో ఈ ఫైట్ దృశ్యాలు చూసి వీడియో తీసి వదిలారు.  మయామీ..ఇదేం సిచువేషన్ !

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *