శ్రియ సీక్రెట్ మ్యారేజ్ ఎక్కడ?

ఎట్టకేలకు టాలీవుడ్ బ్యూటీ శ్రియా‌శరన్ మ్యారేజ్ చేసుకుంది. రష్యాకు చెందిన స్పోర్ట్స్ ప్లేయర్, హోటల్ బిజినెస్‌మేన్ అండ్రీ కొచీవ్‌ని ముంబైలోని లోఖండ్‌వాలాలో పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. మార్చి 12న శ్రియా సొంత ఫ్లాట్‌లోనే ఈ కార్యక్రమం జరిగినట్లు బాంబే సమాచారం. ఈ ఫంక్షన్‌కి ఇరు ఫ్యామిలీలకు చెందిన సభ్యులు, క్లోజ్‌ఫ్రెండ్స్, బాలీవుడ్‌కి చెందిన మనోజ్ బాజ్‌పేయితోపాటు మరికొందరు అటెండయ్యారు. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు టాక్. ఇంతకీ హనీమూన్ ఎక్కడ అన్నది టాప్ సీక్రెట్.

గతంలో అండ్రీ కొచ్చీవ్‌ని హిందూ సంప్రదాయం ప్రకారం శ్రియ మ్యారేజ్ చేసుకోనుందని వార్తలొచ్చాయి. ఐతే, వాటిని శ్రియతోపాటు ఆమె పేరెంట్స్ కూడా ఖండించారు. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని శ్రియ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇంతలోనే పెళ్లి ఏంటంటూ చర్చించుకోవడం మొదలైంది. ఈ లెక్కన ‘పైసా వసూల్’ ఆమెకి లాస్ట్ మూవీ అని అంటున్నారు. అదే బాలీవుడ్‌లో ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన విషయం తెల్సిందే!

Shriya Saran marries Russian boyfriend Andrei Koscheev

Actress Shriya Saran, who made a name for herself in the film industry, tied the knot with her Russian beau Andrei Koscheev. As per reports, the wedding took place at Shriya’s Lokhandwala back residence in Andheri. The wedding was a private affair and only family members and close friends attended the celebration.

It is heard that the couple exchanged their wedding vows in a traditional Hindu ceremony. Reports said that Shriya chose to wear a pink outfit for the special occasion. The wedding ceremony was preceded by a pre-wedding bash on March 11.
 
Further details are still awaited.