ప్రపంచ పెద్దన్నగా చెలామణీ అవుతున్న అమెరికా దేశంలో జాత్యహంకారం పెచ్చరిల్లిపోతోంది. మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయులపై విద్వేష పూరిత దాడులు అక్కడక్కడా నమోదవుతూనే వున్నాయి. తాజాగా.. హర్విందర్ సింగ్ దోడ్ అనే సిక్కు మతస్థుడి మీద దాడి జరిగింది. ఓరెగాన్ లోని ఒక స్టోర్లో పని చేస్తున్న హర్విందర్‌పై ఆండ్రు రామ్సే అనే 24 ఏళ్ల తెల్లజాతి కుర్రాడు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డాడు.

సిగరెట్లు కావాలని కోరగా.. ఐడీ చూపించకుండా ఇవ్వబోనని అక్కడున్న క్లర్క్ నిరాకరించాడని, అప్పటికీ అతడు గొడవకు దిగబోతే, హర్విందర్ సింగ్ కలుగజేసుకున్నాడని తెలుస్తోంది. వెంటనే అతడి గడ్డం పట్టుకుని లాగి.. ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ దుర్భాషలాడాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ హర్విందర్.. నిందితుడిపై హేట్ క్రైం సెక్షన్స్ కింద కేసు పెట్టాడు. FBI రిపోర్ట్స్ ప్రకారం ఓరెగాన్ స్టేట్‌లో గత ఏడాది 40 శాతం జాత్యహంకార దాడులు పెరిగాయి. నాన్-అమెరికన్స్‌పై దాడులకు పాల్పడడం ఒక అలవాటుగా మారిందక్కడివాళ్లకు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *